రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బీమరి దేవయ్య (55) అనే వ్యక్తి రోజు మాదిరిగానే కళ్ళు గీయవడానికి గ్రామ సమీపంలో ఉన్న తాటి చెట్టు దగ్గరికి వెళ్లి కళ్ళు గీయడానికి తాటిచెట్టు ఎక్కాడు కళ్ళు గీస్తుండగా ఈరోజు ఉదయం 8:00am ప్రమాదశాత్తు కాలుజారి తాటి చెట్టు పై నుండి కింద పడగా స్థానికులు గ్రహించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వెళ్లి చూసేసరికి చనిపోయి ఉన్నాడు. అతనికి భార్య ఒక కూతురు ఇద్దరు కుమారులు ఉన్నారు. దేవయ్య చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి