నోయిడా: ప్రొ కబడ్డీ సీజన్-10లో గుజరాత్ జెయింట్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకొచ్చింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 51-42తో బెంగాల్ వారియర్స్‌పై నెగ్గి, 32 పాయింట్లతో టాప్‌నకు చేరుకుంది. గుజరాత్ రైడర్ ప్రతీక్ దహియా 25 పాయింట్లతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం పాయింట్లలో సగం సాధించిన ప్రతీక్‌నే గుజరాత్ విజయానికి కారణం. బెంగాల్ రైడర్లు నితిన్ (12 పాయింట్లు), మణిందర్ (11 పాయింట్లు), శ్రీకాంత్ (9 పాయింట్లు) రాణించినా, ప్రతీక్ దెబ్బకి పరాజయం పాలవక తప్పలేదు. మరో ఉత్కంఠభరిత మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 38-37తో తమిళ్ తలైవాస్‌పై గెలిచింది.