రాజన్న సిరిసిల్ల ఎల్లారెడ్డి పేట మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కిష్టంపల్లిలో నెలకొన్న లో ఓల్టేజ్ విద్యుత్ సమస్యను తీర్చి త్రీ ఫేజ్ విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరుతూ స్థానిక మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ సెస్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఇటీవల కిష్టం పల్లి లో లో ఓల్టేజ్ విద్యుత్ సరఫరా కావడంతో టివిలు, ఫ్రిడ్జ్ లు కూలర్ లు కాలిపోయాయని దీంతో వారికి ఆస్తి నష్టం జరిగిందని బాలరాజు యాదవ్ వినతి పత్రంలో పేర్కొన్నారు. లో ఓల్టేజ్ విద్యుత్ సమస్యను తీర్చి త్రీ ఫేజ్ విద్యుత్ సౌకర్యం కల్పించి ఇక్కడి ప్రజలకు విద్యుత్ ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయన కోరారు.