ఎల్లారెడ్డిపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెన్ని బాబు అధ్యక్షతన ఎల్లారెడ్డిపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు, ఈ సమావేశంలో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని 71, 72, 73, 74, 75, 76,77, 78, పోలింగ్ బూత్ కమిటీల సభ్యులు తేదీ 01-05-2024 న ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పాత బస్టాండ్ లో పెద్ద ఎత్తున జరిగే కార్నర్ మీటీంగ్ కు వారి వారికి కేటాయించిన విధంగా టార్గెట్ పూర్తి చేయాలని మండల పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి కార్యకర్తలను కోరారు, ఎంపీ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావు కు సంబంధించిన ఎన్నికల కరపత్రాలను కండువాలను పార్టీ జెండాలను బూతు ఇన్చార్జిలకు అప్పగిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యకర్తల నాయకుల సమావేశంలో ఎల్లారెడ్డిపేటకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు,