ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన యువజన కాంగ్రెస్ ఎన్నికలలో ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన గంగారపు మహేష్ కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఒడితల ప్రణవ్ బాబును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఒడితల ప్రణవ్ బాబు గంగారపు మహేష్ ను శాలువతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ప్రణవ్ బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసిన వాళ్లకు తప్పకుండా గుర్తింపు ఉంటుంది అనేదానికే ఉదాహరణ గంగారపు మహేష్ అని అన్నారు. యువజన కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా కార్యదర్శి గంగారపు మహేష్ మాట్లాడుతూ తను గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కష్టపడుతున్నానని కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగమైన ఎన్ ఎస్ యు ఐ లో విద్యార్థుల సమస్యలపై గత కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేశానని మొన్న జరిగిన యువజన కాంగ్రెస్ ఎన్నికలలో పోటీచేసి కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా ఎన్నికయ్యానని తన ఎన్నికకు సహకరించిన వారికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి ఒడితల ప్రణవ్ బాబు ఆధ్వర్యంలో హుజురాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు యువజన కాంగ్రెస్ బలోపేతానికి తన వంతుగా కృషి చేస్తానని అన్నారు…