Monday, October 7, 2024
spot_img
HomeINTERNATIONALగూగుల్ లో డేంజర్ బెల్స్

గూగుల్ లో డేంజర్ బెల్స్

ముగింపునకు చేరువైన సంవత్సరం 2022లో తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొన్న రంగాల్లో ఐటీ సెక్టార్ ప్రధానమైనది. మార్కెట్‌లో డిమాండ్ లేమి కారణంగా అప్రమత్తమైన ఐటీ కంపెనీలు వ్యయాల తగ్గింపునకు కీలక చర్యలు తీసుకున్నాయి. ఇందులో భాగంగా పలు కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఎంప్లాయీస్‌పై తొలగింపు వేటు వేసిన కంపెనీల జాబితాలో ట్విటర్, మెటా, అమెజాన్‌ తో పాటు పలు దిగ్గజ ఐటీ కంపెనీలున్నాయి. అందుకే 2022 సంవత్సరం ఐటీ ఉద్యోగులను తీవ్ర ఆందోళనలకు గురిచేసింది. అయితే నూతన ఏడాది 2023లోనూ దాదాపు ఇదే ఒరవడి అనివార్యమని, ఉద్యోగుల తొలగింపులు కొనసాగే అవకాశముందని పలు రిపోర్టులు హెచ్చరిస్తున్నాయి. టెక్ దిగ్గజాలైన గూగుల్, అమెజాన్ వచ్చే ఏడాది వేలాదిమంది తొలగింపునకు సిద్ధమవుతున్నాయని పేర్కొంటున్న పలు రిపోర్టులు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

తొలగింపు పక్రియలో భాగంగా ఉద్యోగుల పనితీరును అంచనా వేసేందుకు కొత్తగా రూపొందించిన ఫెర్ఫార్మెన్స్ రేటింగ్ సిస్టమ్‌ ‘జీఆర్ఏడీ’ను (Google Reviews and Development) అందుబాటులోకి తీసుకొచ్చిందని, ఉద్యోగుల ఉద్వాసన పక్రియలో ఈ వ్యవస్థ సాయం తీసుకోనుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. టీమ్‌లో తక్కువ ప్రదర్శనను స్కోరు ఆధారంగా గుర్తించనున్నారని, నెలల వ్యవధిలోనే చేపట్టనున్న ఉద్యోగుల తొలగింపు ప్రక్రియకు ఇది దోహదపడుతుందని కంపెనీ భావిస్తోందట. ఫెర్ఫార్మెన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లో తక్కువ స్కోరు సాధించిన ఉద్యోగులకు తొలగింపు ముప్పు ఎక్కువగా ఉండనుంది. ఈ రిపోర్టులు గూగుల్ ఉద్యోగులను ఆందోళనలకు గురిచేస్తున్నాయి. కాగా గూగుల్ సుమారు 10 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకబోతోందని గతంలో పలు రిపోర్టులు పేర్కొన్న విషయం తెలిసిందే.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments