రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గర్జనపల్లి గ్రామానికి చెందిన న్యాత పెద్ద రాములు (58) శనివారం మధ్యాహ్నం 3 గంటలకు పశువులకు నీళ్లు పెట్టడానికి వెళ్లి బావి దగ్గర కరెంట్ షాక్కు గురై బావిలో జాడిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ రమేష్ బావిలో నుండి స్థానికులతో కలిసి మృతదేహాన్ని తీసి పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.