2024 ఎలక్షన్స్ కు సంబంధించి జిల్లాలో ప్రతీ నిమిషమూ జరుగుతున్న పనులు, చర్యలు కార్యకలాపాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియచెప్పేందకు ప్రతీ పోలీస్ స్టేషన్, ప్రతీ ఓటింగ్ కేంద్రానికి వ్యయప్రయాసల కోర్చి వెళ్లక్కరలేకుండా జిల్లా కేంద్రంలోనే ఓ మీడియా సెంటర్ ను విజయనగరం జిల్లా యంత్రాంగం జిల్లా పౌర సంబంధాల, సమాచార శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసింది. ఈ మీడియా కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారిణి, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కలెక్టర్ నాగలక్ష్మి ప్రారంభించారు. కలెక్టరేట్ లో పాత ట్రెజరీ కార్యాలయాన్ని పూర్తి స్థాయిలో ఆధునీకరించి ఆ ప్రదేశంలో 24/7 అందుబాటులో ఉండే విధంగా ఎలక్షన్స్ కు సంబందించి మీడియా సెంటర్ ను కలెక్టర్ నాగలక్ష్మి, జేసీ కార్తీక్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం మీడియా సెంటర్‌లో ఏర్పాటు చేసిన నియోజకవర్గాల మ్యాప్‌లను పరిశీలించారు.
జిల్లా కేంద్రంలో మీడియా సెంటర్ ప్రారంభం…!
RELATED ARTICLES