జమ్మికుంట మండలంలోని శాయంపేట గ్రామంలో ఈరోజు ఐమాక్స్ లైట్ ప్రారంభించిన జమ్మికుంట జడ్పిటిసి డాక్టర్ .శ్రీరామ్ శ్యామ్. ఈ సందర్భంగా జెడ్పిటిసి శ్రీరామ్ శ్యామ్ మాట్లాడుతూ జమ్మికుంట మండలంలోని వావిలాల, పెద్దoపల్లె, జగ్గయ్యపల్లి, పాపక్కపల్లె శంభునిపల్లె తనుగుల, నాగంపేట్, కోరపల్లి, వెంకటేశ్వరపల్లి, గ్రామాలలో జిల్లా పరిషత్ నిధి నుండి ఒక్కొక్క గ్రామానికి ఒక లక్ష రూపాయలు చొప్పున కేటాయించి ఆయా గ్రామాలలో ఐమాక్స్ లైట్లు నిర్మాణం చేశామని గుర్తుచేశారు. ఇవే కాకుండా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని గుర్తు చేశారు. జమ్మికుంట మండలాన్ని అభివృద్ధి దశలో నడిపించడంలో తన వంతు కృషి చేస్తున్నానని ఈ నిధులే కాకుండా ఇతరత్రా నిధులు కూడా తీసుకువచ్చి జమ్మికుంట మండలాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చిన జెడ్పిటిసి శ్రీరామ్ శ్యామ్. అభివృద్ధిలో భాగంగా ఆయా గ్రామాలకు అత్యవసర నిధులు అవసరం ఉన్నట్టయితే మా దృష్టికి తీసుకు రావాల్సిందిగా అయన గ్రామ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శాయంపేట మాజీ సర్పంచ్ ఆకనపల్లి సుజాత భద్రయ్య, ఉప సర్పంచ్ లింగంపల్లి రవీందర్రావు, దేవేందర్ రావు, యమ రవీందర్,సుంకరి శ్రీనివాస్, కిషన్ రావు, పంచాయతీ కార్యదర్శి కిషన్, కారాబర్ స్వామి, రాజు అరవింద్, క్రాంతి, శివ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.