మాజీ మంత్రి కేటీఆర్ సూచనల మేరకు రాధారపు సత్యం దుబాయ్ అడ్వకేట్లతో అనునిత్యం మాట్లాడుతూ బందీలుగా ఉన్న రాజన్న సిరిసిల్ల జిల్లా వాసులను విడిపించడంలో ముఖ్య భూమిక పోషించినట్లు సమాచారం. దుబాయిలో వివిధ కంపెనీల్లో పని చేస్తున్న కార్మికులకు చేదోడు వాదోడుగా ఉంటున్న రాధారపు సత్యం సామాజిక సేవలో ముందుండి ఆర్థిక సహాయాలను అందిస్తున్నాడు. నేపాల్ దేశానికి చెందిన ఓ వ్యక్తి హత్య కేసులో సిరిసిల్ల జిల్లాకు చెందిన ఐదుగురికి 25 సంవత్సరాలు జైలు శిక్ష అక్కడి కోర్టు విధించగా గత కొన్నేళ్ల నుండి సిరిసిల్ల ఎమ్మెల్యే, మాజీమంత్రి కేటీఆర్ స్వయంగా పలు దపాలుగా దుబాయ్ వెళ్లి అక్కడి న్యాయవాదులతో మాట్లాడి బాధితుడికి స్వయంగా పరిహారం అందజేసి అక్కడే స్థిరపడిన రాధారపు సత్యమును కేసుకు సంబంధించి వివరాలను ఎప్పటికప్పుడు కనుక్కుంటూ అక్కడి సమాచారాన్ని అందించాలని కోరగా కేసుకు సంబంధించి అక్కడి న్యాయవాదులతో ఎప్పటికప్పుడు సత్యం మాట్లాడుతూ ఖైదీలను విడిపించడంలో ప్రధాన పాత్ర పోషించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేటలోని పలువురు రాధారపు సత్యమును అభినందించారు.