కొమరం భీం అసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలో ఖిరిడి గ్రామానికి రెగ్యులర్ పోస్ట్ మేన్ లేక సంవత్సరాలు గడుస్తున్నాయి. ఇన్చార్జిగా గుండి పంచాయతీకి సంబంధించిన పోస్ట్ మేన్ ను ఇవ్వడం ద్వారా పోస్ట్ ద్వారా వచ్చే ఏటీఎం కార్డ్స్, లెటర్స్, సకాలంలో అందడం లేదు. అదే కాకుండా ఉపాధి హామీ పథకం కింద కార్మికులు పనిచేస్తే ఆ డబ్బులు కూడా అందడం లేదు. ఇది కాకుండా గ్రామంలో సుమారుగా 200 పైగాపెన్షన్ దారులు ఉన్నారు. వారికి సరైన సమయానికి పెన్షన్ అందడం లేదు. ఇన్చార్జిగా ఉన్న పోస్ట్ మేన్ బానే ఉన్నా నెలలో ఒకసారి కూడా సమయానికి రాకపోవడంతో ఖిరిడీ, లింగుడా, భీమ్ గూడా ప్రజలకు పెన్షన్ కానీ ఉపాధి హామీ డబ్బులు గానీ ఉత్తరాలు గాని పోస్ట్ ద్వారా వచ్చే ఏ ఒక్కటి కూడా సరైన సమయానికి అందడం లేదు. కావున వెంటనే కిరుడి గ్రామపంచాయతీ కి రెగ్యులర్ పోస్ట్ మేన్ ను నియమించాలని సిపిఐ ఎంఎల్ రెడ్ స్టార్ జిల్లా కార్యదర్శి గోగర్ల తిరుపతి అన్నారు. లేని పక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెన్షన్ దారులు, ఉపాధి కూలీలు సోమయ్య, రామయ్య, శంకర్, మధుకర్, సుధాకర్, సంతోష్, చంద్రయ్య, గంగవ్వ, లక్ష్మి దేవమ్మ, పోసక్క, నాగుబాయ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.