అమెరికాలో మంచు తుఫాన్ దెబ్బకి మృతిచెందిన తెలుగువారి సంఖ్య మూడుకి చేరింది. అరిజోనా రాష్ట్రంలో గడ్డకట్టిన సరస్సుపై సోమవారం నడుచుకుంటూ వెళ్తూ లోపల పడిపోయి ఏపీలోని గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాలపర్రు గ్రామానికి చెందిన దంపతులు ముద్దన నారాయణ, హరిత గల్లంతైన సంగతి తెలిసిందే. వారితోపాటు మేడిశెట్టి గోకుల్ (47) అనే వ్యక్తి కూడా ఉన్నారు. హరిత మృతదేహం సోమవారమే లభించింది. నారాయణ, గోకుల్ మృతదేహాలను మంగళవారం మధ్యాహ్నం (భారత కాలమానం ప్రకారం బుధవారం వేకువజామున 2:30గంటలకు) గుర్తించారు. గోకుల్ వివరాలు తెలియాల్సి ఉంది.
అమెరికాలో మరో తెలుగు వ్యక్తి మృతి
RELATED ARTICLES