TYF (తెలంగాణ యూత్ ఫోర్స్) అని యువజన విభాగంను మొదలు పెట్టి, నిరాహార దీక్షలు, ధర్నాలు నిర్వహించి, రాష్ట్ర సాధన కోసం చేపట్టిన ఉద్యమంలో యువతను చైతన్యపరిచి, రాష్ట్ర సాధనలో మనము భాగం అవుదామన్న ఆలోచనతో యువతను ప్రోత్సహించి ముందు నడిపాడు రేసు గణేష్! ఉద్యమ సమయం నుండి మొదలు పార్టీనే అంటి పెట్టుకొని, గతంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తరువాత మొట్ట మొదటి యువజన విభాగం పట్టణ అధ్యక్షుడిగా భాద్యతలు నిర్వర్తించి, పార్టీ కోసం పని చేసిన పార్టీ సీనియర్ నాయకుడిగా తనకూ అవకాశం కల్పించాలని, పట్టణంలో పార్టీ నీ ముందుకు నడపడానికి పూర్తిగా కృషి చేస్తానంటూ రేసు గణేష్ ముందుకొస్తున్నట్టు వినికిడి. కాబట్టి విశ్వసనీయ సమాచారం ప్రకారం BRS పట్టణ అధ్యక్ష రేస్ లో రేసు గణేష్ కూడా ఉంటాడు అని సంకేతాలు కనిపిస్తున్నాయి.