ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ వలి నేడు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. మార్కాపురం పట్టణంలోని 3వ వార్డు పరిధిలో ఉన్న సుందరయ్య కాలనీ వాసులు గత రెండు దశాబ్దాలుగా కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారి సమస్యలను తన దృష్టికి తీసుకురాగా డాక్టర్ మహబూబ్ వలి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ కాలనీని సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ:
“ప్రభుత్వాలు మారుతున్నా ఈ కాలనీ ప్రజల తలరాతలు మారడం లేదని ఇది చాలా బాధాకరమని గత ప్రభుత్వం అయినా, ప్రస్తుత ప్రభుత్వం అయినా ఎన్నికల సమయంలో మాత్రమే ఈ ప్రాంతానికి వచ్చి వీరిని ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని ఇది జిల్లా కేంద్రమైన మార్కాపురం మున్సిపాలిటీ పరిధిలోనే ఉండి కూడా కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం దురదృష్టకరమన్నారు.
కాలనీలో ప్రధాన సమస్యలు:
1. తాగునీటి సౌకర్యం లేదు
2. సీసీ రోడ్లు లేవు
3. డ్రైనేజీ వ్యవస్థ లేదు, వర్షాకాలంలో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది
4. పిల్లల చదువు కోసం ప్రభుత్వం స్థలం కేటాయించినా భవనం నిర్మించలేదు. ప్రస్తుతం ఒక అద్దె ఇంట్లో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు స్కూల్ నడుస్తోంది.
సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటే ఇదేనా?”
“డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేద ప్రజల కోసం ఈ కాలనీని ఏర్పాటు చేశారని ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ ప్రాంత అభివృద్ధిని పూర్తిగా విస్మరించాయని “కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ, సెక్యులర్ పార్టీ. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందని కాలనీ వాసులు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని మీ సమస్యలను ప్రభుత్వం మరియు అధికారుల దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారమయ్యే వరకు కాంగ్రెస్ పార్టీ తరపున వారికి అండగా ఉంటామని ఆయన పేర్కొన్నారు.


