కామారెడ్డి జిల్లా తాడ్వాయి వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీనివాస్ గౌడ్ మృతి చెందాడు. గతంలో గంబీ రావుపేట పోలీస్ స్టేషన్ లో సైతం హెడ్ కానిస్టేబుల్ గా, ఎల్లారెడ్డిపేట స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహించి సౌమ్యుడి గా పేరు సంపాదించుకున్నారు. ఇటీవల కామారెడ్డి జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేషన్ కు బదిలీ పై వెళ్ళారు. శ్రీనివాస్ గౌడ్ సొంత గ్రామం ముస్తా బాద్ కాగ గతంలోనే వారి కుటుంబం కామారెడ్డి లో స్థిరపడ్డారు. శ్రీనివాస్ గౌడ్ మృతి పట్ల ఎల్లారెడ్డి పేట రూరల్ సీఐ శ్రీనివాస్ గౌడ్,ఎల్లారెడ్డి పేట ఎస్.ఐ రమాకాంత్ గంభీరావుపేట ఎస్ ఐ రామ్మోహన్, కోనరావుపేట ఏఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.