జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలానికి వచ్చిన నూతన MRO బడే రాజమణి, MPDO ఎనుగొండ స్వరూప లను పూల బొకేలతో సత్కరించిన తెలంగాణ సంచార ముస్లిం తెగల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సయ్యద్ హుస్సేన్. తరతరాలుగా నిరాదరణకు గురవుతూ ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం అందక నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్న 14 తెగల సంచార ముస్లింలకు ప్రభుత్వం ఇప్పటికైనా తగిన న్యాయం చెయ్యాలని ముఖ్యంగా కుల ధ్రువీకరణ పత్రాలు అందక విద్యకు, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంచార ముస్లింలు దూరం అవుతున్నారని, వివిధ కుల వృత్తులు చేసుకుంటూ పొట్టపోసుకునే సంచార ముస్లింలకు తలదాచుకునే చోటు కూడా లేదని అలాంటి వారికి ఇళ్ళు, ఇళ్ల పట్టాలు ఇచ్చి స్థిరనివాసం కల్పించాలని ఈ సందర్భంగా అయన అధికారులను కోరారు. సానుకూలంగా స్పందించిన అధికారులు తెలంగాణ సంచార ముస్లిం తెగల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సయ్యద్ హుస్సేన్ విజ్ఞప్తిని పరిశీలిస్తామని అన్నారు.
