కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం సరండి గ్రామపంచాయతీ గ్రామంలో వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా కార్యదర్శి తన్నీరు వెంకటేష్ ఆధ్వర్యంలో ఆదివారం గ్రామంలో చెట్లు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ ప్రకృతిని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరుదన్నారు. అతరించి పోతున్న అడవులను కాపాడే బాధ్యత నాటిన ప్రతి మొక్కను రక్షించుకోవాలని కాపాడే బాధ్యత ప్రతీ ఒక్కరిపై వుందని పేర్కొన్నారు. పంచాయతీ గ్రామంలోని నర్సరీలో పెంపు చేసిన ప్రభుత్వ మొక్కలను పంపిణీ చేస్తూ నాటడం జరిగిందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వన మహోత్సవం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు బాగ్యస్వామ్యం కావాలని మొక్కలు నాటాలని సూచించారు. వనాలు పెంచే ఉద్దేశంతో సమూహంగా అధిక సంఖ్యలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని వనమహోత్సవం అంటారు. మానవుని మనుగడకు అవసరమైన వాటిలో అతి ముఖ్యమైనవి చెట్లు, చెట్ల యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని పెంచేలా ప్రోత్సహిస్తూ ఈ వనమహోత్సవాన్ని చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి వెంకటేష్, రాజ్ కుమార్, యశ్వంత్ రావు, గౌరు, శ్యామ్ రావు, నారాయణ, షేకిన్, సంజీవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.