రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో తరచూ విద్యుత్ సరఫరాలో అవాంతరాలు ఏర్పడడం, బ్రేక్ డౌన్ కావడం దీంతో గాంధీ ఏరియా ప్రజలు ఇబ్బందులు విద్యుత్ సమస్యతో ఇబ్బంది పడుతున్నామని ఎల్లారెడ్డి పేటలోని గాంధీ ఏరియా ప్రజలు మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ కు పిర్యాదు చేశారు. గాంధీ ఏరియాలో శ్రీ కృష్ణ మెడికల్ హల్ వద్ద విద్యుత్ స్తంభంపై గల వైర్లు వెంట్రుక వాసి మందంలో ఉన్నాయని ఎప్పుడు తెగిపోతాయో అర్థం కాని పరిస్థితి ఉందని ఒగ్గు బాలరాజు యాదవ్ దృష్టికి తీసుకువచ్చారు. మూడవ వార్డులో మహమ్మద్ సైఫ్ ఇంటి వద్ద వైర్లకు ఏపుగా పెరిగిన చెట్ల కొమ్మలతో తరచూ విద్యుత్ బ్రేక్ డౌన్ అవుతుందనీ అక్కడి వారు బాలరాజు యాదవ్ కు పిర్యాదు చేశారు. విద్యుత్ వైర్లను సరి చేయాలనీ S.E పృథ్వి థర్ కు, వైర్లకు అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగింపజేయాలని పంచాయతీ కార్యదర్శి దేవరాజు కు వివరించారు. ఇరు శాఖల అధికారుల దృష్టికి సమస్యను తీసుకు వెళ్లిన బాలరాజు యాదవ్ సెస్ సిబ్బంది ఏనుగుల వెంకటేష్ యాదవ్, హాబీబ్ తో ట్రాన్స్ఫార్మర్ నుండి విద్యుత్ సరఫరా నిలిపి వేయించి గాంధీ ఏరియాలో గల విద్యుత్ తీగలను సరి చేయించి చందనం సతీశ్ కోత మిషన్ సిబ్బందితో వైర్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను బాలరాజు యాదవ్ సరి చేయించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా సరి చేయించిన మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ కు గాంధీ ఏరియా ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.