రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామానికి చెందిన బిజెపి నాయకులు కుంభాల మహేందర్ రెడ్డి ఇంట్లో ఆదివారం రాత్రి దొంగలు ఇంటిలోని సామాగ్రిని అంతా పాడుచేసి ఎరుపు రంగు స్కూటీ TS 23 A 7111 ని ఎత్తుకెళ్లారు. మహేందర్ రెడ్డి ప్రస్తుతం దుబాయ్ లో నివసిస్తున్నారు. భర్త మహేందర్ రెడ్డి వద్దకు సతీమణి, చిన్న కుమారుడు ఏప్రిల్ 10 తారీఖున దుబాయ్ వెళ్ళినారు. పెద్ద కుమారుడు బయట కాలేజీలో ఉంటూ ఎంసెట్ కోచింగ్ తీసుకుంటున్నాడు. యధావిధిగా ఈరోజు ఉదయం చుట్టుపక్కల వారు కుంభాల దేవవ్వ మహేందర్ రెడ్డి ఇంట్లో లైట్లు వేసి ఉన్నాయని గమనించి అనుమానంతో మహేందర్ రెడ్డి అన్న కొడుకు రామ్ రెడ్డికి తెలిపింది. రామ్ రెడ్డి వెంటనే ఇంటికి వచ్చి చూస్తే ఇంట్లో సామాను అంతా చిందరవందరగా పడి ఉండడంతో ఇంట్లో దొంగలు పడ్డారని గ్రహించి వెంటనే దుబాయ్ లో ఉన్న బాబాయ్ మహేందర్ రెడ్డి కి ఫోన్ చేసి వివరించాడు. విషయాన్ని పోలీసులకు కూడా తెలియజేశారు, పోలీసులు వెంటనే రంగంలోకి దిగి, ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అయితే ఇంట్లో ఎవరు లేని సమయంలో నిన్న రాత్రి దొంగలు ఇంటిలోకి ప్రవేశించి వైఫై కనెక్షన్ కట్ చేసి ఇంటిలోని సామాగ్రిని మొత్తం పాడుచేసి స్కూటీని ఎత్తుకెళ్లారు.