మంగళవారం జమ్మికుంట మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వావిలాల పరిధిలోని గండ్రపల్లి గ్రామములోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ జూనియర్ కళాశాల మరియు ధర్మారం గ్రామములో డాక్టర్ విజయకుమార్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్స్ నిర్వహిచారు. జూనియర్ కళాశాలలో 480 మంది స్టూడెంట్స్ కు పరీక్షలు చేసి 53 మంది స్టూడెంట్స్ కు మందులు పంపిణి చేశారు. ధర్మారం గ్రామములో 37 మందికి పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. ఇద్దరు జ్వరం వున్నవారి రక్తపు నమూనాలు సేకరించారు. డాక్టర్ విజయకుమార్, హెల్త్ ఎడ్యుకేటరు ఎ మోహన్ రెడ్డి ఈ సందర్బంగా మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు డెంగ్యూ, మలేరియా, పైలేరియా మొదలగు దోమల ద్వారా వచ్చే వ్యాధుల గురించి, కలుషిత నీటి ద్వారా వచ్చే డైహెరియా, జాండిస్, టైఫాయిడ్ మొదలగు వ్యాధుల లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రతలను క్లుప్తంగా వివరించి, ప్రజలకు మరియు స్టూడెంట్స్ కు అవగాహన కల్పించినారు. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, చేతుల పరిశుభ్రత, రక్త హీనత గురించి స్టూడెంట్స్ కు వివరించారు. కాచి చల్లార్చిన నీటిని త్రాగాలని సూచించారు. స్వచ్చదనం -పచ్చదనం కార్యక్రమంలో భాగంగా డ్రై డే కార్యక్రమం, మొక్కలు నాటడం కార్యక్రమంను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయకుమార్, హెల్త్ ఎడ్యుకేటరు మోహన్ రెడ్డి, సూపెర్వైజర్స్ సదానందం, కుసుమకుమారి, ప్రిన్సిపాల్ ఇందిరమణి, స్పెషల్ ఆఫీసర్ రమేష్, కార్యదర్శి రాము, మణెమ్మ, కవిత, ఏఎన్ఎం లు దీపిక, సంపూర్ణ, పుష్ప లత ఆశాలు మరియు స్టూడెంట్స్ పాల్గొన్నారు..