హైదరాబాద్: దేశం కోసం కాంగ్రెస్ ఎంతో త్యాగం చేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ… గాంధీని చంపిన గాడ్సే భావజాలం కలిగింది బీజేపీ అని వ్యాఖ్యలు చేశారు. మోదీ పాలనలో దేశ ప్రజల దుస్థితిని తెలియచెప్పేందుకే రాహుల్ భారత్ జోడోయాత్ర అని చెప్పుకొచ్చారు. రాహుల్ జోడో యాత్ర ఉద్దేశాల్ని గడప గడపకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. 2003 వైఎస్సార్ పాదయాత్ర ఒక సంచలనమని… నాడు ఇందిరమ్మ రాజ్యం తెస్తానని వైఎస్సార్ బయలుదేరారని గుర్తుచేశారు. వైఎస్సార్ పాదయాత్రతో సమూల మార్పులు తీసుకొచ్చారన్నారు. తతలాంటి ఎంతోమంది వైఎస్సార్ పాదయాత్రలో భాగస్వామ్యమయ్యామని భట్టి విక్రమార్క తెలిపారు.