రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో తెలంగాణ ప్రదాత కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి గుడి నిర్మించి అభిమానాన్ని చాటుకున్నాడు మాజీ సర్పంచ్ నేవూరి మమత వెంకట్ రెడ్డి. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సాయిబాబా కమాన్ ప్రక్కన పాలరాతితో ఆలయాన్ని నిర్మించాడు. ఆదివారం తెలంగాణ దశాబ్ది అవతరణ దినోత్సవం సందర్భంగా పిసిసి సభ్యుడు నాగుల సత్యనారాయణ చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం వెంకట్ రెడ్డి మాట్లాడుతూ మలి దశ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన దేవత సోనియమ్మ అని తలుచుకుంటున్నారని అన్నారు. గుడి నిర్మణం కొరకు 2014లో భూమి పూజ చేసి పిల్లర్ వేసి స్లాప్ వెశాడు. అనంతరం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందడంతో గుడి నిర్మాణం ఆగిపోయిందని పేర్కొన్నారు. గత ఏడాదిలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిసి అధికారంలోకి రావడంతో సోనియా గాంధీ గుడిని పూణర్నిర్మాణం చేసి రంగులు వేసి ప్రారంభించుకోవడం శుభసూచకం అన్నారు. దశాబ్ది కాలం తర్వాత తన కల సాకారమైందని తెలిపారు. కాగా సోనియాగాంధీకి ఆలయాన్ని నిర్మించినందుకు వెంకట్రెడ్డిని కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ సంగీతం శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దుమ్మాటి నరసయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి పార్టీ వర్గాలు అభినందించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య, లీడర్లు షేక్ గౌస్, వంగ గిరిధర్ రెడ్డి, బుగ్గ కృష్ణమూర్తి, మర్రి శ్రీనివాస్ రెడ్డి, చెన్ని బాబు, బండారి బాల్ రెడ్డి, గంట అంజాగౌడ్, పందిర్ల లింగం గౌడ్, గంట వెంకటేష్ గౌడ్, గన్న మల్లారెడ్డి, నంది కిషన్, రఫిక్, గుండాడి రాంరెడ్డి పాల్గొన్నారు.