Saturday, July 13, 2024
spot_img
HomeTELANGANAరేషన్ బియ్యం అక్రమ దంధా ను అరికట్టాలి: సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం

రేషన్ బియ్యం అక్రమ దంధా ను అరికట్టాలి: సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం

కరీంనగర్ జిల్లాలో యదేచ్చగా నడుస్తున్న రేషన్ బియ్యం అక్రమ దంధాను అరికట్టాలని సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
నగరంలో అన్నివాడల్లో చిరువ్యాపారులు మైకులు పెట్టి బియ్యం కొంటామని యదేచ్చగా తిరుగుతూ రేషన్ బియ్యం సేకరించి, బడా వ్యాపారులకు అమ్ముతున్నారని, ఈ బియ్యాన్ని బడా వ్యాపారులు రైస్ మిల్లులకు తరలిస్తూ అక్రమంగా దోచుకుంటున్నారని వీరిపైన కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. రైస్ మిల్లర్లు ప్రభుత్వం దగ్గర సేకరించిన (CMR) బియ్యం కింద లెక్కలు చూపిస్తూ తమ వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరుకాయలుగా మలుచుకుంటున్నారని. జిల్లాలోనే కాకుండా హుజురాబాద్ నియోజకవర్గంలో మరియు జమ్మికుంట మండల కేంద్రంలో ఇలాంటి తతంగం నడుస్తుందని ప్రజలు గుసగుసలాడుతున్నారు దీనిపైన పౌరసరపరాల శాఖ అధికారి నియంత్రణ కొరవడిందని అన్నారు. గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా ప్రారంభమైన అక్రమ రేషన్ బియ్యం దందా నేటికి కొనసాగుతుందని, కొత్త ప్రభుత్వం వచ్చాక నైనా కఠిన చర్యలు తీసుకొని అక్రమంగా రేషన్ బియ్యం దందాను కొనసాగిస్తున్న బాధ్యుల పైన PDయాక్ట్ పెట్టి జైల్లో వేయాలని డిమాండ్ చేశారు. టాస్క్ ఫోర్స్ అధికారులు, పోలీసు యంత్రాంగం, జిల్లా కలెక్టర్ స్పందించి అక్రమ రేషన్ బియ్యాన్ని అరికట్టాలని అన్నారు. పలుమార్లు రేషన్ బియ్యం దందాలో పట్టుబడిన వ్యాపారులు మళ్లీ అదే వ్యాపారాన్ని యదేచ్చగా కొనసాగిస్తున్నారు అంటే దాని వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. అధికారులు వ్యాపారులు కుమ్మక్కై వాటాలు తీసుకుంటున్నారా? అనే అనుమానం ప్రజల్లో కలుగుతుందని ఇప్పటికైనా రేషన్ బియ్యాన్ని అక్రమ వ్యాపారంగా మారుస్తున్న బడా వ్యాపారుల పైన కఠిన చర్యలు తీసుకొని అక్రమ రేషన్ బియ్యం దందాను అరికట్టాలని కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments