రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి జ్ఞానదీప్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో జాతీయ రహదారుల వారోత్సవాల్లో భాగంగా విద్యార్థిని విద్యార్థులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ట్రాఫిక్ నిబంధనలు వివరించిన సిరిసిల్ల జిల్లా మోటార్స్ వెహికిల్ ఇన్స్పెక్టర్ కిషోర్ చంద్రా రెడ్డి. చాలామంది వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం వల్ల ప్రమాదాలకు గురై అక్కడికక్కడే మరణాలు సంభవిస్తున్నాయని, వాహనదారులు తప్పకుండా హెల్మెట్లు ధరించి వాహనాలను నడపాలని కుటుంబ సభ్యులు కూడా హెల్మెట్లు ధరించాలని బాధ్యతాయుతంగా గుర్తుచేయాలని ఆయన సూచించారు,
కారు డ్రైవర్లు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని డ్రైవింగ్ సమయంలో సీట్ బెల్ట్ లు ధరించాలని, విద్యార్థులు గాని ఇతరులు గాని రోడ్డు దాటేటప్పుడు ఇరువైపులా చూసుకుని దాటాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో జ్ఞానదీప్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు మిట్టపల్లి లక్ష్మీనారాయణ, రాజన్న సిరిసిల్ల జిల్లా మోటార్ డ్రైవింగ్ స్కూల్ యూనియన్ అధ్యక్షులు కట్టెల బాబు, సురేష్, రాజు, జ్ఞానదీప్ హైస్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు