ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పాలేవనం ప్రకృతిలో పోలీస్ వారు నిర్వహిస్తున్న ఉచిత క్రీడా శిక్షణ శిబిరాన్ని స్థానిక సిఐ శ్రీనివాస్ గౌడ్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ అఖిల్ మహేజల్ ఆదేశాల మేరకు యువత చెడు అలవాటులకు పడకుండా మానసిక ఉల్లాసం కోసం 18 సంవత్సరాలు పైబడిన వారు ఈనెల ఒకటో తారీకు నుంచి 31 వ తారీకు నిర్వహించే ఉచిత క్రీడా శిక్షణలో భాగంగా పేరు నమోదు చేసుకొని శిక్షణలో పాల్గొనాలని ఆయన అన్నారు. ఈ క్రీడాలు స్థానిక పి ఈ టి ల ఆధ్వర్యంలో నిర్వహించబడును తెలిపారు. ఈ కార్యక్రమంలో 150 మంది విద్యార్థిని విద్యార్థులు 9 మంది పీఈటీలు స్థానిక ఎస్సై రమాకాంత్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.