కాకినాడ జిల్లా ప్రత్తిపాడు జాతీయ రహదారిని ఆనుకుని నరేంద్ర గిరి కొండపై నూతనంగా నిర్మితమవుతున్న ఆంధ్రా భద్రాద్రి నూతన ఆలయ నిర్మాణానికి ప్రత్తిపాడు గ్రామానికి చెందిన చెలంకూరి రాజబాబు దంపతుల ఆధ్వర్యంలో వారి బంధువులు కీర్తి శేషులు నల్లం వెంకట రత్నం భార్య నల్లం సావిత్రి, వారి కుమారులు ఉదయ భాస్కర్, చంద్రశేఖర్, వీర వెంకట సత్యనారాయణలు కలిపి లక్ష రూపాయల నగదును విరాళంగా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులకి అందచేశారు. ప్రత్తిపాడు గ్రామానికి చెందిన ప్రముఖ ఫైనాన్స్ వ్యాపారి యాళ్ళ గంగబాబు దంపతులు ప్రధాన ఆలయంలో లక్ష్మి దేవి విగ్రహ నిర్మాణం నిమిత్తం ఒక లక్ష యాభై వేల రూపాయలు విరాళంగా ప్రకటించారు. విరాళాలు ఇచ్చిన వారిని కుటుంబ సమేతంగా ఆలయ కమిటీ సభ్యుడు, ప్రముఖ పురోహితులైన తేజోమూర్తుల సుబ్రహ్మణ్య శర్మ ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యుల సమక్షంలో వేద మంత్రోచ్ఛరణతో శాలువాలు కప్పి సన్మానం చేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చాట్ల పుష్పారెడ్డి, రెడ్నం రాజా, పత్రి రమణ, గోగుల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రా భద్రాద్రి ఆలయ నిర్మాణానికి విరాళాలు ఇచ్చిన వారిని సన్మానించిన కమిటీ సభ్యులు
RELATED ARTICLES