ఆదివారం రోజున ఇల్లందకుంట మండల కేంద్రంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి చెల్పూరి రాము మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా ఖరీఫ్ సీజన్ లో రైతులకు పచ్చి రొట్టె విత్తనాలను సబ్సిడీపై వెంటనే అందజేయాలనీ డిమాండ్ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే రైతులు అత్యధికంగా వరి సాగు చేస్తున్నారని పచ్చి రొట్ట ఎరువుగా వాడే జీలుగ, పెసరు, విత్తనాలు సబ్సిడీపై కొనుగోలు చేసి ప్రతి యేటా మే నెల రైతులకు సరైన సమయం అన్నారు. ఈ సంవత్సరం రుతుపవనాలు ముందుగా వస్తున్నాయని వాతావరణ శాఖ పలుమార్లు సూచించినప్పటికీ జూన్ నెల వస్తున్నా ఇప్పటివరకు పచ్చి రొట్ట విత్తనాలను రైతులకు సరఫరా చేయడంలో వ్యవసాయ శాఖ అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారని వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి కరీంనగర్ జిల్లాలో పచ్చి రొట్ట ఎరువుగా వాడే జీలుగ విత్తనాలను సత్వరమే సరఫరా చేసే విధంగా చర్యలు చేపట్టాలని తెలంగాణ రైతు సంఘం తరపున ఆయన డిమాండ్ చేశారు…


