రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల ఫోటో వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం అధ్యక్ష ఎన్నికలు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు గాజుల శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి ముత్యాల ప్రభాకర్ రెడ్డి కోశాధికారి సుధగోని సురేష్ గౌడ్ ఆధ్వర్యంలో అధ్యక్షునిగా ఎండి అజీముద్దీన్, ఉపాధ్యక్షులుగా మారోజు కుబేర స్వామి, శాడ చంద్రశేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పెంజర్ల తిరుపతి యాదవ్, కోశాధికారి నాగుల శ్రీధర్, సహాయం కార్యదర్శి ఎం హరీష్, గౌరవ సలహాదారులుగా ముత్యాల ప్రభాకర్ రెడ్డి, పాలాజీ శ్రీనివాస్ చారి, ఎండి ఫక్రుద్దీన్, ఎండి షాదుల్, కార్యవర్గ సభ్యులుగా ఏ రాజు, మారోజు నరసింహ చారి ఎన్నుకోబడ్డారు. ఈ సందర్భంగా అజీముద్దీన్ మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి పాటుపడతానని భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక సూచనలు సలహాలు తీసుకొని ముందుకెళ్తానని మరియు ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీకి సంబంధించినటువంటి ఫోటో ఫ్రేమ్స్ మరియు గిఫ్ట్ ఫోటో ఫ్రేమ్స్ స్టూడియో వాళ్లే తయారు చేస్తారని ఈ పనిని జనరల్ స్టోర్ వాళ్ళు గాని వేరే బిజినెస్ దారులు గాని చేయడానికి వీలులేదని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల టౌన్ అధ్యక్షులు సబ్బాని ప్రకాష్ కోశాధికారి సాప సుధాకర్ పాల్గొన్నారు