నవరత్నాలలో భాగంగా జగన్ ప్రభుత్వం… మరో సారి ఇండ్ల పట్టాల పంపిణీ కి శ్రీకారం చుట్టారు. మూడేళ్ళ క్రితం… విజయనగరం గుంకలాంలో అతి పేద్ద లే అవుట్ ను సీఎం జగన్ ప్రారంభించని అనంతరం… మరో రెండు మూడు వేల మంది కి ఇండ్ల పట్టాల పంపిణీ కై శ్రీకారం చుట్టారు… డిప్యూటీ స్పీకర్ కోలగట్ల. ఈ క్రమంలో విజయనగరం సమీపంలో వై జంక్షన్ వద్ద సారిక లో జగనన్న లే అవుట్ కార్యక్రమం ప్రారంభమైంది. ఇందులో భాగంగా ప్రతీ లబ్ధిదారునికి ఆధార్ కార్డ్ ఆధారంగా… అలాగే విజయనగరం మున్సిపల్ కార్పోరేషన్ లి ప్రతి డివిజన్ లో వలంటీర్ తో పేర్లు సేకరించి… సంబంధిత కార్పోరేటర్ ద్వారా… లబ్ధిదారులను ఎంపిక చేసారు… విజయనగరం మున్సిపల్ కార్పోరేషన్.దీంతో లబ్ధిదారులకు దగ్గరుండి.. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల…. అర్హులైన లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, అసిస్టెంట్ కమీషనర్ ప్రసాదరావు… కార్పొరేటర్లు… రంగారావు ఇతరులు పాల్గొన్నారు.
ఇండ్ల పట్టాల పంపిణీ కి శ్రీకారం
RELATED ARTICLES