Saturday, October 5, 2024
spot_img
HomeTELANGANAయువత చదువుతో పాటుగా అన్ని రంగాల్లో రాణించాలి.

యువత చదువుతో పాటుగా అన్ని రంగాల్లో రాణించాలి.

క్రీడల వల్ల ఆత్మవిశ్వాసం, స్వీయ క్రమశిక్షణ ఏర్పడుతుంది.

యువత క్రీడల్లో గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని, అదే స్ఫూర్తిని నిజ జీవితంలో అలవర్చుకోవాలి. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అన్ని పోలీస్ స్టేషన్లలో ప్రారంభమైన దోస్తీ మీట్ – 2024 కబడ్డీ, వాలీబాల్ పోటీలు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గురువారం రోజున సిరిసిల్ల, తంగాలపల్లి ,ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన దోస్తీ మీట్ – 2024 కబడ్డీ, వాలీబాల్ క్రీడా పోటీలకు ముఖ్య అతిధిగా హాజరై క్రీడాలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ దేశ భవిష్యత్తు నేటి యువత చేతిలో ఉంటుందని, చెడు వ్యసనాలకు అలవాటు పడి భవిష్యత్ నాశనం చేసుకోవద్దని, అదే ఉద్దేశ్యంతో కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా జిల్లాలో యువతను క్రీడల వైపు ప్రోత్సహించేందుకు, మాధకద్రవ్యాల వలన కలుగు అనార్దలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడానికి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో దోస్తీ మీట్-2024 లో భాగంగా ఈక్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందని, ఈ క్రీడల్లో మండల స్థాయిలో గెలుపొందిన జట్లు జిల్లా స్థాయిలో నిర్వహించే పోటీల్లో పాల్గొంటాయి అన్నారు.

యువత చదువుతో పాటుగా అన్ని రంగాల్లో రాణించాలని, క్రీడల్లో ప్రతి ఒక్కరు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని, అదే స్ఫూర్తి ని నిజ జీవితంలో అలవర్చుకుంటు ముందుకు సాగాలని యువతకు పిలుపునిచ్చారు.క్రీడలలో పాల్గొనడం వల్ల శారీరకంగా,ఆరోగ్యం గా దృడంగా ఉండడంతో పాటు మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారని అన్నారు. నిజ జీవితంలో సమిష్టి కృషి తోనే విజయాలను సులువుగా చేరుకోగలమనే దానికి ఉదాహరణ క్రీడలని అన్నారు. క్రీడ ఓటమి చెందిన వారు తమ లోపాలను సవరించుకొని ముందుకు వెళ్లడం అలవర్చుకోవాలని అన్నారు.ఈ క్రీడా పోటీలకు సహకరిస్తున్న ఎల్లారెడ్డిపేట మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు బొమ్మ కంటీ రాజయ్యను, ఆర్ఎంపి పిఎంపి అసోసియేషన్ అధ్యక్షులు కొండ ఆంజనేయులు గౌడ్ చారీలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించారు. ఎస్పీ వెంట డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సి.ఐ లు రఘుపతి, సదన్ కుమార్, శ్రీనివాస్, ఎస్.ఐ సుధాకర్, రమాకాంత్ సిబ్బంది, వ్యాయామ ఉపాద్యాయులు, క్రీడాకారులు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments