హైదరాబాద్: కాంగ్రెస్ నేతలను తీసుకుని బీజేపీ బలపడే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. మంత్రి మల్లారెడ్డికి ఆస్తులు ఇప్పుడు కొత్తగా వచ్చాయా? అని ఆయన ప్రశ్నించారు. 8 ఏళ్లలో లేని దాడులు ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. బీజేపీ పైకి ఏసీబీని పంపే వ్యూహం కేసీఆర్ చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాసమస్యలపై రేపు కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడించారు.