కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డుతో పనిలేకుండా వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలతో పాటు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు రాష్ట్ర ప్రభుత్వం అందజేయాలని డీజేఎఫ్ జర్నలిస్టు సంఘం కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించింది. ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘ నాయకులు మాట్లాడుతూ ఎలాంటి ఆధారాలు లేకుండా కొన్ని పోలీస్ స్టేషన్లో జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని అలాంటివి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ వెంకటేష్ కు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిర్పూర్ నియోజకవర్గం లోని వివిధ మండలాల జర్నలిస్టులు పాల్గొన్నారు.