తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కరీంనగర్ లో తలపెట్టిన కదనాభేరి బహిరంగ సభకు ఎల్లారెడ్డిపేట మండలంలోని వివిధ గ్రామాల నుండి ప్రజా ప్రతినిధులు బస్సులో గ్రామస్తులను తరలించారు. ఎల్లారెడ్డిపేట నుండి ఐదు బస్సులు ఎంపీటీసీ 1 పందిర్ల నాగరాణి ఆధ్వర్యంలో సుమారు 300 మందిని కెసిఆర్ బహిరంగ సభకు తీసుకొని వెళ్లారు. బస్సులో వెళ్లిన వారితో మండల ప్రజా ప్రతినిధులు సీనియర్ నాయకులు ఎస్సీ సెల్, ఎస్టీ సేల్, బీసీ సెల్, అధ్యక్షులు మండల మహిళా అధ్యక్షురాలు, గ్రామ శాఖ అధ్యక్షులు, బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఉన్నారు.