పెంచికల్ పేట్ మండలంలోని ఎల్లూరు గ్రామ పంచాయితీ పరిధిలోని అంబేద్కర్ కాలనీలోని ఎస్సి వాడలో గత పది రోజులుగా త్రాగు నీటికోసం ఉపయోగించే బోరింగ్ పనిచేయక పోవడంతో కాలనీ వాసులు త్రాగు నీటికి నానా అవస్థలు పడుతున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్తే కనీసం స్పందించడం లేదని కాలనీ వాసులు వాపోతున్నారు. ఉన్నతధికారులు స్పందించి బోరింగ్ మరమ్మత్తులు చేపించి త్రాగు నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.