Thursday, October 22, 2026
spot_img
HomeTELANGANAకోట్లు విలువ చేసే భూమిని కొత్త బస్టాండ్ కు విరాళం ఇచ్చిన భూ దాతలకు దక్కని...

కోట్లు విలువ చేసే భూమిని కొత్త బస్టాండ్ కు విరాళం ఇచ్చిన భూ దాతలకు దక్కని గౌరవం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గల కోట్లు విలువ చేసే భూమిలో కొత్త బస్టాండు నిర్మాణం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇచ్చిన భూమికి దక్కని గౌరవం. మూడు దశాబ్దాలుగా భూదాతల పేర్లను శిలాఫలకంపై పెట్టకపోవడంతో భూదాతలు అసహనం వ్యక్తం చేశారు. గుడికో, బడికో ఐదో పదో విరాళంగా ఇస్తే దాతల పేర్లు బోర్డుపై లిఖిస్తారు. అలాంటిది సుమారు మూడు కోట్లు విలువ చేసే భూమి అప్పటి పీపుల్స్ వార్ సూచనల మేరకు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన నెవూరి పోచయ్య గారి నారాయణరెడ్డి, నేవూరి పోచయ్య గారి బాలకృష్ణారెడ్డి, నేవూరి సర్వయ్య గారి సర్వారెడ్డి, దుబ్బ ఎల్లారెడ్డి లకు ఉన్న భూమిని కొత్త బస్టాండు నిర్మాణం కొరకు సంతోషంగా విరాళంగా అప్పటి ప్రెసిడెంట్ బాపు నేవూరి వెంకట్ రెడ్డి, జడ్పిటిసి ఎలుసాని మల్లయ్య,సర్పంచ్ వడ్నాల నరసయ్య సమక్షంలో ఇచ్చి నిర్మాణం చేసి ఆర్టీసీ చైర్మన్ సత్యనారాయణ రావు తో కలిసి ప్రారంభించి మండల ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇచ్చిన భూమికి బదులుగా 10 గుంటల భూమి ఇస్తామని పీపుల్స్ వార్ ప్రజా దర్బార్ ఎల్లారెడ్డిపేటలో ఏర్పాటు చేసి హామీ ఇచ్చి మరిచారని కనీసం ఇచ్చిన భూమికి తమ పేర్లు కూడా ఇప్పటివరకు శిలాఫలకంపై పెట్టలేదని స్వర్గీయ నారాయణ రెడ్డి కుమారుడు నేవూరి వెంకట నరసింహారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం భూదానం చేసిన వారి పేర్లను శిలాఫలకంపై నమోదు చేసి తమ జ్ఞాపకాలను చెరుగకుండా చూడాలని కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments