ఎల్లారెడ్డిపేట మండలం ఆగ్రహారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో శుక్రవారం కొండచిలువను గ్రామ భజరంగ్ యూత్ సభ్యులు హాతమార్చారు. ఆగ్రహారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐదు తరగతులకు ఇద్దరు ఉపాధ్యాయులు పనిచేస్తుండగా 26 మంది విద్యార్థులు మాత్రమే 1వ తరగతి నుంచి 5 వ తరగతి వరకు చదువుతున్నారు. వీరికి అదే గ్రామానికి చెందిన మామిండ్ల ఎల్లయ్య విద్యార్థులకు మధ్యాహ్న భోజనం గత సంవత్సర కాలంగా వండిపెడుతున్నారు. కాని ఇప్పటి వరకు ఆయనకు బిల్లు రాలేదని విద్యకమీటి అద్యక్షులు మామిండ్ల కిషన్ తెలిపారు.
స్కూల్ ఆవరణలో నర్సరీ వద్దు నర్సరీ వల్ల స్కూల్ ఆవరణలో పాములు తేళ్ళు సంచరిస్తున్నాయని సంబంధించిన మండల అదికారులకు పిర్యాదు చేసిన పట్టించుకోలేదని కిషన్ విలేకరులతో మాట్లాడారు. నెల రోజుల క్రితం నాగుపాము స్కూల్ కిటికీ వద్దకు రాగా స్కూల్ విద్యార్థులు చూసి చెప్పగా గ్రామస్తులు చంపి వేశారని, శుక్రవారం జెండా వందనం ముగించుకుని విద్యార్థులందరు ఇళ్ళకు వెళ్ళిపోయిన తరువాత స్కూల్ ఆవరణలోకి కొండ చిలువ రాగా గ్రామంలోని భజరంగ్ యూత్ వారు గమనించి చంపి వేశారని విద్యకమీటి అద్యక్షులు కిషన్ విలేకరులతో చెప్పారు. నర్సరీ వల్ల స్కూల్ ఆవరణలో పాములు తేళ్ళు సంచరిస్తున్నాయని దీని వల్ల విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని చేతులు కాలిన తరువాత ఆకులు పడితే లాభం లేదని వెంటనే నర్సరీని మరోచోటికి మార్చాలని కిషన్, ఆగ్రహారం గ్రామస్తులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు కోరుతున్నారు,