ద్విచక్ర వాహన దారునికి, మరో ఇద్దరికీ గాయాలు కరీంనగర్ లోని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలింపు,
ఎల్లారెడ్డి పేట కొత్త బస్టాండ్ సమీపంలోని మాలోత్ సూర్య వాచ్ రిపేరింగ్ సెంటర్ ఎదుట కామారెడ్డి సిరిసిల్ల ప్రధాన రహదారి ప్రక్కన పార్కింగ్ చేసి ఉంచిన కారును ప్రక్కనే నిలబడి ఉన్న ఇద్దరు వ్యక్తులను ఆదివారం ఉదయం 9-30 గంటల ప్రాంతంలో స్క్రూటీ టి ఎస్ 22 కె 0 527 నెంబర్ వాహనంపై వెళుతున్న కోరుట్ల పేట విద్యుత్ సభ్ స్టేషన్ లో ఆపరేటర్ గా పనిచేస్తున్న పెద్దపల్లికి చెందిన యూనోష్ అతివేగంగా ఆజాగ్రత్తగా నడిపి ఢీ కొట్టాడు. ఈ సంఘటనలో దుమాల గ్రామానికి చెందిన సిరిపురం సంపత్ కు చెందిన కారు టి ap 23 డి యు 6047 వెనుక భాగం ధ్వంసం అయింది. నారాయణ పూర్ గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు వంగల రాజేశ్వరీ (50 ) ఆమే మనుమడు గోగూరి ఈషాక్ ( 6 ) స్క్రూటీ వాహనదారు యూనోష్ గాయపడ్డారు. వారిని వారి బందువులు కరీంనగర్ లోని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు,