కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఆసిఫాబాద్ డిసిసి అధ్యక్షులు విశ్వప్రసాద్, నాయకులు, కార్యకర్తలు మండలం గ్రామపెద్దలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించిన సందర్భంగా ఆత్రం సుగుణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నేను చేసిన అనేక సేవలను గుర్తించి మొట్ట మొదటి సారిగా ఆదివాసీ మహిళకు పార్లమెంట్ టికెట్ కేటాయించిందని నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాలు, అందరూ కలిసి నా గెలుపుకు కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆరు గ్యారెంటీలు, సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి చెరువిధంగా నిరంతరం కృషి చేస్తానని మొన్ననిన్న వచ్చి మోసం చేసిన వారిని నమ్మి ఓటర్లు ప్రజాలెవరు మోసపోవద్దని ఉద్యోగాన్ని వదిలేసి ప్రజాసేవకై వచ్చానని పార్టీ గెలుపు కోసం కృషి చేయాల్సిన అంశాలను కార్యకర్తలకు మండల ప్రజానీకానికి ఆమె సూచించారు.