సీఎం జగన్మోహన్ రెడ్డి సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇటీవల ప్రకటించిన వైసిపి అనుబంధ విభాగాల కమిటీల్లో కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామానికి చెందిన యువ నాయకుడు బుద్ధ గణేష్ కాకినాడ జిల్లా వైయస్సార్సీపి యువజన విభాగం జనరల్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా బుద్ధ గణేష్ తనకి ఈ అవకాశం కల్పించడానికి సహకరించిన ఎమ్మెల్సీ అనంత బాబుని, నియోజవర్గ ఇన్చార్జి వరుపుల సుబ్బారావుని ఏలేశ్వరంలో మర్యాదపూర్వకంగా కలిసి పూలమాలతో సాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అనంత బాబు బుద్ధ గణేశుని అభినందిస్తూ పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తూ మరెన్నో పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు అడపా పార్ధసారధి, 3వ వార్డ్ కౌన్సిలర్ బదిరెడ్డి గోవింద్ బాబు, బదిరెడ్డి వెంకన్న బాబు, జువ్విన వీర్రాజు, సర్పంచులు సూతి వీరకృష్ణ ప్రసాద్, బీశెట్టి అప్పలరాజు, కూనపురెడ్డి సుబ్బారావు, తూర్పు లక్ష్మీపురం ఎంపీటీసీ యిజనగిరి శివప్రసాద్, యూత్ లీడర్ భీశెట్టి స్వామిలతో పాటు ఏలేశ్వరం మండల సర్పంచులు, ఎంపీటీసీలు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు
ఎమ్మెల్సీ అనంతబాబుని సన్మానించిన వైసీపీ యువజన విభాగ జనరల్ సెక్రటరీ బుద్ధ గణేష్
RELATED ARTICLES