రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోలీస్ స్టేషన్లో ఎస్సై చిందం గణేష్ ఆధ్వర్యంలో రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్సై చిందం గణేష్ మాట్లాడుతూ రౌడీ షీటర్లు తన నేర ప్రవృత్తిని మార్చుకోవాలని ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దని ఒకవేళ ఏవైనా అసాంఘిక కార్యకలాపాలకు అయినా పాల్పడుతున్నారని తెలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు