రాజన్న సిరిసిల్ల ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ బిజెపి అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మరని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఐదింటిని నెరవేర్చారని కేవలం మహిళలకు 2500 రూపాయలు ఇచ్చే పథకం ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఆగిపోయిందన్నారు. బిజెపి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రజలకు పంచుతున్న కరపత్రాలలో రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని వడ్లకు500 రూపాయల బోనస్ ప్రజలకు అందించే సమయంలో పార్లమెంటు ఎన్నికల సందర్భంగా వచ్చిన కోడ్ వలన ఆగిపోయిందని, మాట ఇస్తే వెనుకకు తీసుకొని అబద్దమాడే ప్రసక్తే లేదని ప్రధానమంత్రి మోదీ జన్ ధన్ ఖాతాలు తీయమని సంవత్సరానికి 15 లక్షల రూపాయలు ఖాతాలలో వేస్తామని, సంవత్సరానికి నిరుద్యోగ యువకులకు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మాట తప్పారన్నారు. ప్రధానమంత్రి మోదీ వలన అంబానీ, ఆదాని, లలిత్ మోడీ, నీరవ్ మోడీ వంటి బడా వ్యాపారులకు బాకీలు మాఫీ చేశారని కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. బిజెపి పార్టీలో కిందిస్థాయిలో కార్యకర్తలు కేసులలో ఇరుక్కుని ఇబ్బంది పడతా ఉంటే కనీసం వారిని ఆదుకునే ప్రయత్నం ఆ పార్టీ నాయకులు చేయడం లేదన్నారు. ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా కార్యదర్శి లింగం గౌడ్, గిరిధర్ రెడ్డి, నాయకులు గంట బుచ్చ గౌడ్, చెన్నిబాబు, బిపేట రాజు, కొత్తపల్లి దేవయ్య, బండారి బాల్ రెడ్డి, రాములు పాల్గొన్నారు