ఆకాల వర్షాల దృష్ట్యా ప్రజలు అందరు అప్రమత్తంగా ఉండాలని వాంకిడి మండలం పోలిస్ స్టేషన్ ఎస్సై డీ. సాగర్ శుక్రవారం ఒక మీడియా ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై డీ. సాగర్ మాట్లాడుతూ కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు ఉరుములు, పిడుగులతో కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షం పడుతున్న సమయంలో ఎవరు కూడా చెట్ల కిందకు, బయటకు వెళ్లవద్దని చెట్ల మీద పిడుగులు పడే అవకాశం ఎక్కువ ఉంటుందన్నారు. తెలంగాణలో మరో 4 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మంచిర్యాల, ములుగు, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మెదక్ తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడొచ్చని స్పష్టం చేసింది. దీంతో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మధ్యప్రదేశ్ నైరుతి ప్రాంతంలో ఆవర్తనం కేంద్రీకృతమై ఉండటమే ఈ వర్షాలకు కారణమని వాతావరణ శాఖ పేర్కొంది.