Friday, July 12, 2024
spot_img
HomeTELANGANAదాహంతో నీటి కోసం వచ్చిన మచ్చల జింక పై కుక్కల దాడి

దాహంతో నీటి కోసం వచ్చిన మచ్చల జింక పై కుక్కల దాడి

కుక్కల దాడిలో జింక ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కేంద్రంలో ఈ ఘటన జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం మండల కేంద్రానికి సమీపంలో అటవీ ప్రాంతం ఉంది. ఈ అటవీ ప్రాంతంలో జింకల సంచారం ఉంటుంది. వేసవికాలం కావడంతో దాహార్తి కోసం మచ్చల జింక గ్రామ సమీపంలోకి రాగా, వాటిని చూసిన కుక్కలు వెంబడించాయి. జింక గ్రామంలోకి పరుగులు తీసి వచ్చింది. దీన్ని స్థానికులు సెల్‌ఫోన్‌లో ఫోటో తీశారు. కుక్కలు వెంబండించి దాడి చేయడంతో గ్రామస్థులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో గ్రామానికి చేరుకొని జింకకు చికిత్స చేయించి అడవిలోకి వదిలిపెట్టామని తెలిపారు. వేసవికాలం కావడంతో త్రాగునీటి కోసం కోనరావుపేట గ్రామ సమీపంలోకి జింక వచ్చి ఉండవచ్చునని అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments