మే 13(సోమవారం) జరిగే ఎన్నికల పండుగ రోజున ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని. భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఎన్నికల నియమాలు దృష్ట్యా కోడు అమల్లో ఉన్నందున 144 CRPC అమల్లో ఉన్నందున పోలింగ్ స్టేషన్ వద్ద ఎవరు గుమిగూడి ఉండరాదు. సెల్ ఫోన్స్ పోలింగ్ స్టేషన్ లోపలికి అనుమతి లేదు కనుక ఓటర్స్ దీన్ని గుర్తించి ఎవరు కూడా సెల్ఫోన్ తీసుకురావద్దు. పోలింగ్ స్టేషన్ చుట్టుపక్కల ఇండ్లలో ఎన్నికల రోజు కొత్త వ్యక్తులు/తెలిసిన వారని ఉండనివవద్దు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఎవరైనా వ్యవహరించినట్లయితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోబడును. అని ముస్తాబాద్ ఎస్ ఐ శేఖర్ విజ్ఞప్తి చేశారు.