రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన షంషీర్ సిరిసిల్ల బీఈడీ కళాశాల ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నారు. షంషీర్ తెలంగాణలో తెలుగు మీడియం విద్యార్థులకు ఉద్యోగాలు లభించే అవకాశాలు సాధ్యా సాధ్యాలపై 2010-2015 వరకు పరిశోధన చేశారు. ఈ అంశంపై ప్రొఫెసర్ డాక్టర్ వినోద్ కుమార్ మిశ్రా పర్యవేక్షణలో చేసిన పరిశోధనకు డాక్టరేట్ పొందారు. ఈ సందర్భంగా తమ గ్రామానికి చెందిన యువకుడు పి హెచ్ డి పట్టా సాధించడంపై నారాయణపూర్ గ్రామానికి చెందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పలువురు నాయకులు హర్షం వ్యక్తం చేశారు. షంషీరు ను మిత్రులు గ్రామ ప్రజలు ఈరోజు సన్మానించి అభినందించారు