పసలుకోసారి పగడ్బందీ గద్దుమ్,
అదేండ్లైన పదంబాడీందే లేదు.
చాందిరేసిర్రంటే శేన్లదాక పాకు ముచ్చట,
మేం సచ్చిన మన్న ఇప్పుడెవ్వలకు తెలవదాయే.
తబులలు తాళాల సప్పుడు తాళ్లల్లకినవాడు,
తణుకుపోయిన ఇప్పుడు తాళాలద్దంటుర్రు.
హరిశ్చంద్రుని ఏషం గడితే ఆలాంచి అచ్చెటోళ్ళు,
ఆపతివడ్డ ఇప్పుడు ఆనకుంటనే పోవట్టే.
బుడ్డెoకడు కనవడితె బుగ్గలూదినట్టు నవ్వచ్చు,
ఇప్పుడు ఆ బుడ్డెంకడి బతుకే గజునామాయే.
కథాకిరిదాక మంది ఉంటే కడుపు నిండినట్టవు,
కథాడుతం అంటే ఇప్పుడు గదెంది అంటుర్రు.
అన్ని వేషాలు ఏసిర్రుగనీ ఇక సాల్తియ్ అంటుర్రు.
మముల అంటుర్రు మాయి బైరూపులేషాలట
(పాశ్చాత్య నాగరికత ప్రభావంతో సినిమాల ప్రభావం వల్ల మరుగున పడి ఆర్థికంగా చిన్నాభిన్నమైన చిందు బాగోతుల కళాకారుల బతుకుల మనోవేదన)
రచయిత
కొ.స.కు
(కొల్లూరి సంతోష్ కుమార్)
9908931403