రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట గ్రామ శ్రీ వేణు గోపాల స్వామి దేవాలయ చైర్మన్ గా దళిత సామాజిక వర్గానికి చెందిన యువకుడు గడ్డం జితేందర్ను గ్రామస్థులు నియమించి, పదవి కాలం రెండు సంవత్సరాలుగా నిర్ణయించి, ఆలయ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. దళితుడు అయినను, విద్యావంతుడు కావటంతో, ఆలయ నిర్వహణ సక్రమంగా నిర్వహిస్తూ గ్రామస్థుల మన్ననలు పొందుతున్నాడు. దళితుడు కావటంతో, గ్రామంలోని అగ్రవర్ణాలకు చెందిన కొందరు వ్యక్తులు, సామాజిక మాధ్యమాల్లో, ఆటోలో ప్రచారం నిర్వహించి ఆ ప్రచారాన్ని, ప్రస్తుత ఆలయ కమిటీ అధికారికంగా చేసింది అని ప్రజలను నమ్మించారు. సమావేశంలో ఆలయ ఛైర్మన్ గడ్డం జితేందర్ లేకపోవటంతో ప్రజలంతా, సందుపట్ల లక్ష్మా రెడ్డి, ముత్యాల ప్రభాకర్ రెడ్డి, నంది కిషన్ లను నిలదీశారు. ఇలాంటి తప్పుడు ప్రకటనలు పునరావృతం అయితే గ్రామం తరపున చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. ఈ విషయంపై ఇంక్విలాబ్ టీవీ శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ చైర్మన్ గడ్డం జితేందర్ ను వివరణ కోరగా, అనధికార వ్యక్తులు కొందరు ప్రజలను తప్పుదారి పట్టించడానికి, ఆలయ కమిటీ పేరు మీద ప్రకటనలు ఇస్తున్నారని అలాంటి వ్యక్తులపై ఫిర్యాదు చేస్తామని త్వరలో అధికారికంగా, ఆలయ కమిటీ తరపున గ్రామ సభ నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ వేణు గోపాల స్వామి దేవాలయ వైస్ చైర్మన్ గంటా వెంకటేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి గంట అంజా గౌడ్, కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు సంతోష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు