సికింద్రాబాద్-దాణాపూర్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ నెంబర్ (12791/92) జమ్మికుంట రైల్వే స్టేషన్ లో త్వరలో ఆగనుందని. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ విజ్ఞప్తి మేరకు రైల్వే శాఖ హాల్టింగ్ కు అనుమతినిచ్చినట్లు ఆ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి గురువారం తెలిపారు. ఈ సందర్భంగా జమ్మికుంట బీజేపీ పట్టణశాఖ ఆధ్వర్యంలో జమ్మికుంట రైల్వే స్టేషన్ లో ప్రధాని నరేంద్ర మోడీ, ఎంపీ బండి సంజయ్ కుమార్, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్. చిత్రపటాలకు పాలభిషేకం చేశారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ ‘దాణాపూర్’ ఎక్స్ ప్రెస్ ను జమ్మికుంట రైల్వే స్టేషన్ లో ఆపే విషయమై ఎంపీ బండి సంజయ్ కుమార్ పలుమార్లు అధికారులపై ఒత్తిడి చేశారని తెలిపారు. స్వయంగా ఆయన రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో మాట్లాడారని ఈ క్రమంలో సికింద్రాబాద్ నుంచి దాణాపూర్ వెళ్లే రైలు జమ్మికుంట రైల్వే స్టేషన్ లో ఆగేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు రైల్వే బోర్డ్ జాయింట్ డైరెక్టర్ వివేక్ కుమార్ సిన్హా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రయాణికుల రద్దీ, డిమాండ్ ను బట్టి దక్షిణ మధ్య రైల్వే అధికారులు తదుపరి చర్యలు తీసుకోనున్నారని ఈ నేపథ్యంలో ప్రజలు ‘దాణాపూర్’ ఎక్స్ ప్రెస్ రైలును సద్వనియోగం చేసుకోవాలని బీజేపీ నాయకులు కోరారు. నాగ్ పూర్, కాశీ, వారణాసి వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను దర్శించుకునే ప్రయాణికులు ఈ ఎక్స్ ప్రెస్ ద్వారా ప్రయాణించొచ్చని నాయకులు వివరించారు. పాలాభిషేకం కార్యక్రమంలో బీజేపీ జమ్మికుంట పట్టణ శాఖ అధ్యక్షులు జీడి మల్లేశ్, జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి రాజేశ్ ఠాకూర్, నాయకులు రాజేందర్, రవి, రాకేశ్ ఠాకూర్, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు.