రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన త్రిమూర్తి శివ జయంతి (శివరాత్రి) మహోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ . జ్యోతి ప్రజ్వలన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి జెండా ఆవిష్కరించారు. స్వామి వారి కృప, కరుణ, ప్రజలందరిపై ఉండాలని వేడుకున్నారు. శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా శివ జయంతిని రోజులుగా జరుపుకోవాలని ఆనవాయితీగా వస్తుందని, ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విద్యాలయం వారు చేస్తున్న శాంతి బోధనలు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని, జ్ఞాన సూర్యుడైన శివ పరమాత్మ వర్తమాన సమయంలో ఈ సృష్టిపై అవతరించి మానవులలో అజ్ఞాన అంధకారాన్ని తొలగిస్తున్నారని అన్నారు..