రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణ పూర్ గ్రామంలో పవిత్ర రంజాన్ మాసం సందర్భముగా ఉపవాసం ఉండే ముస్లీం సోదరులకు ఆదివారం సాయంత్రం బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు దొమ్మాటి నరసయ్య ఆద్వర్యంలో ఇప్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటీ నర్సయ్య మాట్లాడుతూ ఇప్తార్ విందు మతసామరస్యానికి ప్రతిక అని అన్నారు. ఉపవాస విరమణ సమయంలో ఫ్రూట్స్, భోజనం ఏర్పాటు చేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు.
ఈ ఇప్తార్ విందు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్రి శ్రీనివాస్ రెడ్డి, సూడిది రాజేందర్, గుండాడి రాం రెడ్డి, మాజీ జెడ్ పి టి సి ఏలూరి రాజయ్య, కొండాపురం శ్రీనివాస్ రెడ్డి, బండారి బాల్ రెడ్డి, పందిళ్ళ సుధాకర్ గౌడ్. మాజిద్, సిరిపురం మహేందర్, దొమ్మాటి రాజు, మజీద్, సధర్, గౌస్ బాయి, కమిటీ ప్రతినిధులు, నన్నేసాబ్, సాదుల్లా బాయి, సమద్ బాయి, బాబు మియ్యా, గున్నూబాయి, బాబు, మజీద్, తదితరులు పాల్గొన్నారు,